MAXICURE PM – ధమనికి కోత..ఇంటర్నల్‌ బైపాస్‌ తో ప్రాణాలు కాపాడిన మ్యాక్స్ క్యూర్

ధమనికి కోత..ఇంటర్నల్‌ బైపాస్‌ తో ప్రాణాలు కాపాడిన మ్యాక్స్ క్యూర్
ప్రమాదవశాత్తు ఒక ధమని కోతకు గురైతే ఏమవుతుందో ఎప్పుడైనా ఊహించారా..? బీదర్‌కు చెందిన 20 సంవత్సరాల యువకుడు ఈ అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. రోడ్డు ప్రమాదంలో అతని కుడి చేయి గ్లాస్‌ కారణంగా కోతకు గురైంది. అతని చేయి నుంచి రక్తం ఏకధాటిగా కారుతూనే ఉంది. అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తక్షణమే హైదరాబాద్‌ కు తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు. హైదరాబాద్‌కు అతను ప్రయాణిస్తున్నం త సేపూ ఓ ప్రెషర్‌ బ్యాండ్‌ను అతని గాయాలకు అప్లయ్‌ చేశారు. అతడ్ని మాదాపూర్‌ లోని మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్‌ వద్దకు తీసుకు వచ్చారు. హాస్పిటల్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి అతి ప్రమాదకరంగా మారింది. డాక్టర్లు అతని ప్రాణాలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. చివరికి ఇంటర్నల్‌ బైపాస్‌ సర్జరీ చేసి ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు మ్యాక్స్ క్యూర్ వైద్యులు. ఈ ఆపరేషన్‌ వివరాలను ఈరోజు హైదరాబాద్‌ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు డాక్టర్లు..
మ్యాక్స్ క్యూర్ ఎమర్జెన్సీ టీమ్‌ హెడ్‌ డాక్టర్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ”అతను హాస్పిటల్‌కు చేరుకునే సమయానికి మేం గమనించింది ఏమిటంటే అతని కుడి చేయి పై భాగం చల్లబడిపోయింది. అసలు ఏ విధమైన నాడీ కొట్టుకోవడం లేదు. ఇది లింబ్‌ ఇషెమియా (డెడ్‌)కు అతి ప్రమాదకరమైన సంకేతం. గాయం జరిగిన ప్రాంతం నుంచి రక్తం కారుతూనే ఉంది. ఈ బ్లిdడింగ్‌ కారణంగా అతని బీపీ, హెమోగ్లోబిన్‌ అతి తక్కువకు పడిపోయాయి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. మేం మా వాస్క్యులర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శైలేష్‌ కుమార్‌ను పిలిచేముందు అతని స్థితిని స్టెబిలైజ్‌ చేయాల్సి వచ్చింది అని అన్నారు.
వాస్క్యులర్‌ స్పెషలిస్ట్‌. డాక్టర్‌ శైలేష్‌ కుమార్‌ గార్గ్‌ మాట్లాడుతూ ‘యాంజియోగ్రామ్‌ చేసిన మీదట, మేం కనుగొన్నదేమిటంటే షార్ట్‌ సెగ్మంట్‌ (దాదాపు 4 సెంటీమీటర్లు) బ్రాచియల్‌ (ఆర్మ్‌) అర్టెరీ నుంచి బ్లిడింగ్‌ అవుతుందని, అతని బీపీ, హెమోగ్లోబిన్‌ స్థాయి తక్కువగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకుని, తెరువడం అనేది మరింత ప్రమాదం కలిగిస్తుందని భావించి ఇంటర్నల్‌ బైపాస్‌ సర్జరీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ సర్జరీ చేయడానికి 4 – 5 గంటల సమయం పట్టింది. ఈ శస్త్ర చికిత్సలో ఉన్న క్లిష్టతలను పరిగణలోకి తీసుకుంటే ఇది హై రిస్క్‌ సర్జరీ” అని అన్నారు. ఇంటర్నల్‌ బైపాస్‌ సర్జరీతో మే విడివడిన ధమనులను కవర్డ్‌ స్టెంట్‌ ఉపయోగించి కనెక్ట్‌ చేశాం. తద్వారా బ్లడ్‌ లీకేజ్‌ని అరికట్టడంతోపాటుగా చేయిపై భాగానికి రక్త ప్రసరణ మెరుగుపరిచాం. తద్వారా రోగి జీవితాన్ని కాపాడటంతో పాటుగా అతని కుడి చేయికి వైకల్యం రాకుండా కాపాడగలిగాం అని తెలిపారు.